ఫైళ్లు తగులబడుతుంటే చోద్యం: కోదండ, పొన్నం సూచన

Kodandaram
హైదరాబాద్: సచివాలయంలో ఫైళ్లు తగులబడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం మండిపడ్డారు. తెలంగాణ భూములకు సంబంధించిన ఫైళ్లను తగులబెడుతున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ వస్తుందని అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కొందరు సీమాంధ్ర నేతలు విభజన జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు లాభమే అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధంగా తీర్చుకోవచ్చునన్నారు. సీమాంధ్ర నేతలు సభ పెట్టుకోవచ్చునని అయితే, అనాగరికంగా తెలంగాణను మాత్రం అడ్డుకోవద్దన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడ వద్దన్నారు.

వర్షాల కారణంగా జన చైతన్యయాత్ర వాయిదా పడిందన్నారు. గురువారం నిర్వహించ తలపెట్టిన ధర్నాను ఆగస్టు 1వ తేదికి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా ఉంటుందని చెప్పారు. మూడు దశల ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తానని చెప్పారు.

ఎపిఎన్జీవోలకు సమ్మె చేసుకునే హక్కు ఉందని టిఎన్జీవో నేత దేవిప్రసాద్ అన్నారు. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణను అడ్డుకునే కుట్ర చేస్తే మాత్రం తాము తగిన సమాధానం చెబుతామన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అనవసర భయాలు సృష్టించవద్దన్నారు.

గందరగోళం వద్దు: పొన్నం

సీమాంధ్ర నేతలు సభలు పెట్టుకోవడంలో తప్పులేదని అయితే, గందరగోళం మాత్రం సృష్టించవద్దని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాధన సభ తర్వాత తెలంగాణపై తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తేలిందన్నారు. సీమాంధ్రులు సమావేశాలు పెట్టుకుంటే తప్పులేదని, గందరగోళం సృష్టిస్తే మాత్రం 2009 పునరావృతమవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+