సమైక్యవాదులకు అండ: కెవిపిపై ఎంపి గుత్తా నిప్పులు

సమ్మె చేయాలంటూ ఏపీఎన్జీవోలను, బంద్‌లు ప్రకటించాలంటూ సమైక్యాంధ్ర జేఏసీని, రాజీనామాలు చేయాలంటూ సీమాంధ్ర మంత్రులపై కెవిపి ఒత్తిడి తెస్తున్నారని గుత్తా ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభల్లో చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్న దశలో దానికి తూట్లు పొడిచేలా కెవిపి ప్రయత్నించడం సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే కెవిపి తెలంగాణ సమాజపు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే ఇస్తుందని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నడిగడ్డ శ్రీనివాస్ పక్షాన ప్రచారం నిర్వహించారు.
డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతుందన్నారు. తెలంగాణ రాదని అనుమానపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐక్యంగా తెలంగాణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications