టిడిపి హవా: చంద్రబాబు హ్యాపీ, చెంపపెట్టని హరికృష్ణ

టిడిపికి అండగా ఉన్నందుకు ఓటర్లకు, గెలుపునకు కృషి చేసినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిందని విమర్శించారు. పాలనను అస్తవ్యస్థం చేసిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, విద్యుత్ కోతలతో మంచినీటి పథకాలు మూలనపడేలా చేశాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ పిల్ల కాంగ్రెసును తిరస్కరించి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారన్నారు.
పంచాయతీ ఎన్నికల రెండో దశ, మూడో దశలోను తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు, తెరాస మద్దతుదారులను మట్టికరిపించి టిడిపి మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికే వేయాలని, ఇతర పార్టీలకు వేసినా ఉపయోగం ఉండదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలకు ఓటు వేసినా ఉపయోగం ఉండదన్నారు. ధన బలం, అధికార దుర్వినియోగంతో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారన్నారు.
పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో టిడిపిని గెలిపించినందుకు ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వార్థ రాజకీయాలు చేద్దామనుకున్న పార్టీలకు ఫలితాలు చెంప పెట్టు అన్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెసు పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications