విభజిస్తే పార్టీకి, పదవులకి రాజీనామా: సీమాంధ్ర నేతలు

తెలంగాణ విషయంలో అనుకోనిది జరిగితే, జరగరానిది జరిగితే తాము పార్టీని, పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరూ సమైక్యాన్ని సమర్థిస్తూ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారన్నారు. తమకు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.
ఇదే విషయాన్ని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల ద్వారా తమ సమైక్య గళాన్ని అధిష్టానానికి వినిపించే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ తాము 26వ తారీఖున ఉదయం ఢిల్లీ వెళ్తామన్నారు. పార్టీ పెద్దలను కలుస్తామని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతారని తాము అధిష్టానాన్ని నమ్ముతున్నామని చెప్పారు. హైకమాండ్ కూడా తమను విశ్వసించాలన్నారు. లేదంటే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బేటీ అనంతరం వారు ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications