టి: సీమాంధ్ర మంత్రుల భేటీ, టిజివిపి ఆందోళన ఉద్రిక్తం

ఈ భేటీలో పంతొమ్మిది మంది మంత్రులు పాల్గొన్నారు. మంత్రులు బాలరాజు, ఆనం రామనారాయణ రెడ్డి, విశ్వరూప్, శైలజానాథ్, కొండ్రు మురళీ, రఘువీరా రెడ్డి, శత్రుచర్ల విజయ రామరాజు, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, గల్లా అరుణ కుమారి, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పార్థసారథి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, అహ్మదుల్లా, టిజి వెంకటేష్, వట్టి వసంత్ కుమార్ తదితరులు వచ్చారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలనే యోచనలో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానానికి లేఖ రాయడం, ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాలని వారు భావిస్తున్నారు. హైదరాబాదులో సభ నిర్వహించడం పైన కసరత్తు చేస్తున్నారు. సిడబ్ల్యూసి కంటే ముందే కీలక నిర్ణయం తీసుకోవాలి వారు భావిస్తున్నారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, తోట త్రిమూర్తుల హాజరు కాలేదు.
సమైక్యానికే కట్టుబడి ఉన్నా కానీ..: గల్లా
తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని మంత్రి గల్లా అరుణ కుమారి చెప్పారు. అయితే అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఉద్రిక్తత
సీమాంధ్ర మంత్రులు సమావేశమైన మినిస్టర్స్ క్వార్టర్సులోకి తెలంగాణవాదులు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు గేటు నుండి లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేయగా, పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications