స్టార్ బ్యాట్స్‌మన్ కిరణ్: శ్రవణ్, సీమలో సమైక్య వేడి

ఢోకా లేదు: డికె అరుణ
రాష్ట్ర విభజనపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి డికె అరుణ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడున్న ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి అభద్రత ఉండదన్నారు. విడిపోయి సోదరుల్లా కలిసుందామన్నారు. సీమాంధ్ర నేతలు సమావేశం పెట్టుకోవడం తప్పు కాదని ఆమె చెప్పారు. అయితే అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉండాలన్నారు.
రాజీనామాలు సరికాదు: నాగం
సీమాంధ్ర నేతలు రాజీనామా చేయడం సరికాదని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామా ఓ నాటకమన్నారు. మంత్రుల రాజీనామాలు ఆమోదించి కాంగ్రెసు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించడమేమిటన్నారు. రాజీనామాలతో బెదిరించడం సరికాదన్నారు.
సీమాలో సమైక్య వేడి
సీమాంధ్రలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలో భేటీ అయ్యారు. సమైక్యాంధ్ర కోసం నేతలు అందరూ రాజీనామా చేయాలని, రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు 29న ఆందోళన చేయాలని, సిడబ్ల్యూసిలో సమైక్యవాదం వినిపించాలని వారు భేటీలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాంతీయ వాదన్ని అడ్డు పెట్టుకొని దోచుకున్నది తెలంగాణ నేతలే అన్నారు. విభజిస్తే మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. సీమాంధ్రను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. త్వరలో హైదరాబాదులో సభ, జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications