వెనక్కి వెళ్లలేం: టిపై ఫలించని చిరు, కావూరి ప్రయత్నం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారని తెలుస్తోంది. అయితే విభజనపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు వచ్చి సమైక్యం అంటే లాభం లేదని, అంతగా కావాలంటే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోవాలని ఆజాద్, పటేల్‌లు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నిర్ణయం ఖరారైందని, ఈ దశలో వెనక్కి వెళ్లలేమని వారు మంత్రులకు చెప్పారట. తెలంగాణ సమస్య ఎప్పటి నుండో ఉందని, దానిని ఎటూ తేల్చకుండా ఉండలేమని, గతంలో తెలంగాణపై మాటిచ్చామని, ఇరు ప్రాంతాల నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని, నిర్ణయం అయిపోయినందున సీమాంధ్ర నేతలను బుజ్జగించాలని చిరు, కావూరి, పళ్లం రాజులకు వారు సూచించినట్లుగా సమాచారం.
కాగా శుక్రవారం భేటీ అయిన సీమాంధ్ర మంత్రులు మరో ప్రయత్నంగా అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడంతో పాటు కేంద్రమంత్రులను అధిష్టానం వద్దకు రాయబారులుగా పంపేందుకు కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి చిరు, పళ్లం రాజు, కావూరిలు పార్టీ పెద్దలను కలిశాక, వారికి కూడా విభజనపై సంకేతాలు అందాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications