బొత్సకు ఆజాద్ హెల్ప్?: పిఎంతో సీమాంధ్ర నేతల భేటీ

ఆజాద్‌కు బొత్స అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లుగా కాంగ్రెసులో కూడా ప్రచారం సాగుతోందట. విజయనగరం పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ శుక్రవారం సీమాంధ్ర నేతల సమావేశంలో పాల్గొనలేదు. ఆజాద్‌కు బొత్స సహకారంలో ఇది భాగమేనని అంటున్నారు.
సమైక్యమే ముద్దు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను సీమాంధ్ర ప్రాంత నేతలు శనివారం కలుసుకున్నారు. కలిసిన వారిలో కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, పల్లంరాజు, పురంధేశ్వరి, పలువురు ఎంపీలు ఉన్నారు. విభజన చేయవద్దని, సీమాంధ్ర ప్రజలు విభజనను అంగీకరించరని వారు ప్రధానితో చెప్పారు.
వారికి ప్రధాని నుండి ఎలాంటి సానుకూల సంకేతాలు రానట్లుగా తెలుస్తోంది. అయితే వారు చెప్పిన విషయాన్ని తాను అధినేత్రికి చెప్పినట్లుగా సమాచారం. అనంతరం సీమాంధ్ర నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంటు కోరారు.
ఆజాద్ ముందు అనంతపురం జిల్లా ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి సమస్యల చిట్టా విప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయ భౌగోళిక పరిస్థితి వివరించి, సమైక్యంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. సీమాంధ్ర నేతలతో ఆజాద్ సంప్రదింపులు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications