టి వ్యతిరేక పార్టీ మాకొద్దు: జగన్ పార్టీపై కొండా సురేఖ

ఈ భేటీలో కొండా దంపతులు, నేతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్, రాజ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమో, పార్టీ నిర్ణయమో తమకు అధిష్టానం చెప్పలేదన్నారు.
తాము అసంతృప్తితోనే బయటకు వచ్చామని చెప్పారు. సీమాంధ్ర నేతల రాజీనామాల పైన, తెలంగాణ విషయంలో తమకు సరైన సమాధానం దొరకలేదని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్నామనే అపవాదు తమకు వద్దని ఆమె అన్నారు. వెయ్యిమంది తెలంగాణ బిడ్డలు చనిపోయినా తాము తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఎలా ఉంటామన్నారు.
సీమాంధ్ర ఎమ్మెల్యేల నిర్ణయం పార్టీ వైఖరి కాకపోతే తమకు ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ వైఖరి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తామంతా మరోసారి చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సురేఖ అన్నారు.
పార్టీ వీడే యోచనలో...
పార్టీ అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించని పక్షంలో పార్టీని వదిలేందుకే నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని వీడి ఏం చేయాలనే దాని పైన కూడా వారి చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications