మంత్రి తోట హల్‌చల్, పోలింగ్ కేంద్రంపై రాళ్ల దాడి

పోలింగ్ ప్రారంభమైన ఏడు గంటల నుండే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దొమ్మాలపాడులో పోలింగ్ ప్రారంభానికి ముందే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామాలకు వెళ్లాలనుకున్న వారికి సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సరిపడా బస్సులు లేక ప్రయాణీకులు బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి బయలుదేరాల్సిన బస్సు అర్ధరాత్రి దాకా కూడా బయలుదేరక పోవడంతో ప్రయాణీకులు అధికారులను నిలదీశారు.
తోట హల్‌చల్
మంత్రి తోట నరసింహం తన స్వగ్రామం వీరవరసంలో హల్ చల్ చేశారు. మంత్రి సతీమణి సర్పంచిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన మంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారి పట్ల మండిపడ్డారు. వారిపై పరుషపదజాలం వాడారు. మంత్రి తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పలువురు నకిలీ ఓటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మీర్జాపేట పంచాయతీలో గ్రామస్తులు పోలింగ్ కేంద్రంపై రాళ్లతో దాడి చేసారు. ఓ పార్టీ అభ్యర్థికి అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు దాడి చేశారు.












Click it and Unblock the Notifications