బంద్: మంత్రి ఇల్లు ముట్టడి, రాజీనామే అన్న తోట

తూర్పు గోదావరి జిల్లాలోని వీరవరంలో మంత్రి తోట నర్సింహం మాట్లాడుతూ... తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్ర మంత్రులం రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లా బాపట్లలో బంద్ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు పెత్త ఎత్తున చౌరస్తాకు చేరుకొని ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
సమైక్యాంధ్రకే మద్దతు: అసద్
తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేశాయని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో మతతత్వ శక్తులు పుంచుకునే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications