తెలంగాణ అడిగితే రాయల ఏంటి: సోమిరెడ్డి, బైరెడ్డి ఫైర్

ముందు రాజధాని, రెవెన్యూ, నీటి కేటాయింపులు, తెలుగు ప్రజల ప్రయోజనాల పైన కేంద్రం స్పష్టత ఇవ్వాలని లేదంటే ఉద్యమిస్తామని చెప్పారు. తెలంగాణ విషయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు.
కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే విభజిస్తామంటే తాము సహించేది లేదన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను విడగొట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఏవిధంగా విభజిస్తారని ప్రశ్నించారు. సీట్లు, ఓట్లతో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు నాటకమాడుతోందన్నారు.
ఫిడేలుతో కాలక్షేపం: బైరెడ్డి
రాయలసీమను విభజిస్తామంటుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఫిడేలు వాయిస్తూ కాలక్షేపం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు.
సీమ విభజన కోసం తమ ప్రాంత నేతలను ఎవరితోనైనా సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు. సీమను గడ్డిపోచతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూస్తోందని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని పడగొట్టి తెలంగాణ వారితో తాము ఎలా కలుస్తామని ప్రశ్నించారు. శ్రీశైలం, సుంకశుల వంటి ప్రాజెక్టులను తెలంగాణ వారికి చాక్లెట్ల మాదిరి పంచుతున్నారన్నారు.
పయ్యావుల ఇంటి ముట్టడి
సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేతలు టిడిపి నేత పయ్యావుల ఇంటిని ముట్టడించారు. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత తాను స్పందిస్తానని అయన చెప్పారు.












Click it and Unblock the Notifications