స్టార్ ఇంకా బ్యాటింగ్, పాలిటిక్స్‌కి గుడ్‌బై: టిపై లగడపాటి

విభజన జరిగితే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లనే రాష్ట్రంలో వేర్పాటువాదం రాజుకుందన్నారు. తెలంగాణపై బిల్లు పెడితే పార్లమెంటులో, అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తే మనకే నష్టమన్నారు. రాజీనామాలు చేయకుండా నేతలను సమైక్యాంధ్ర జెఏసి నేతలు ఒప్పించాలని కోరారు.
రాజీనామాలు చేస్తే తీర్మానం సమయంలో మన మెజార్టీ తగ్గుతుందన్నారు. ప్రజలు ఉద్యమిస్తేనే సమైక్య రాష్ట్రం సాధ్యమన్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికైనా అందరూ నేతలు ముందుకు రావాలని, తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కళ్లు తెరువాలని కోరారు. వేర్పాటువాదులకు టిడిపి తొత్తుగా మారిందన్నారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని, వేర్పాటువాదుల్లా హింసకు పాల్పడవద్దన్నారు.
ఎమ్మెల్సీ రాజీనామా
సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు మేకా శేషుబాబు శనివారం తన పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications