తెలంగాణ ఇచ్చేందుకు యూపిఏ సిద్ధం: జెడి శీలం

ఆంధ్రా రైతాంగానికి ఎలాంటి నష్టం జరగని విధంగా ఈ నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పుడు కాకాపోయినా పదేళ్ళ తర్వాత అయినా తెలంగాణ ఇవ్వాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులు ఇక్కడ వున్నాయని ఆయన తెలిపారు.
యూపిఏ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే ముందు ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరగకుండా, ఈ ప్రాంత అభివృద్ధి జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి నదీ జలాలు, రవాణా సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కుటిల యత్నాలు: గుత్తా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకొనేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలతో కుటిలయత్నాలు చేస్తున్నారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వేరుగా ఆరోపించారు.
సమైక్య బోనాలు : శ్రావణ్
సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలు జరుపుకునే చివరి బోనాల పండుగ ఇదేనని తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి, బోనాల జాతర ఉత్సవాలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications