మీనాక్షి.. కెవ్వుకేక: టంచ్ మాల్ అన్న దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కీలక నేత, మధ్యప్రదేశ్ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షీ నటరాజన్ పైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

తన పార్టీకి చెందిన మీనాక్షిని వంద శాతం టంచ్ మాల్ (సెక్సీ మహిళ) అంటూ సరస వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్‌లో మాండ్‌సౌర్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ప్రచార సభలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు. అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎంపీ మీనాక్షి నటరాజన్‌ను చూస్తూ ప్రసంగం మధ్యలో దిగ్విజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Meenakshi Natarajan and Digvijay Singh

మీనాక్షి పార్లమెంటు సభ్యురాలని, గాంధేయవాది, చాలా సాధారణంగా ఉంటారు, జాలి గుండె, నిరాడంబరి, నిజాయతీపరురాలు, ప్రతి గ్రామానికి వెళ్తూ అందర్నీ కలుస్తుంటారు, ఆమె వాంఛనీయ మహిళ, టంచ్ మాల్ అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లో తల పండిన స్వర్ణకారుడి వంటివాడిని అని, నగ అసలు ఏది.. నకిలీ అనేది ఇట్టే చెప్పేయగలనని నవ్వుతూ అన్నారు. దీనిపై బిజెపి తీవ్రంగా మండిపడింది.

దిగ్విజయ్‌కు మతి భ్రమించిందని, ఆయనను తక్షణం పిచ్చి ఆ స్పత్రిలో చేర్చించాలని ఆ పార్టీ నాయకుడు వినయ్ కతియార్ మండిపడ్డారు. అయితే, దిగ్విజయ్ వ్యా ఖ్యలను తాను తప్పుగా భావించడం లేదని మీనాక్షి పేర్కొన్నారు. దిగ్విజయ్ గొప్ప నేత అని, ఆయన వ్యాఖ్యల్లో అభ్యంతరకర అంశమేదీ లేదని, తన పనితీరుకు మెచ్చుకోలు అని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+