రాజీనామాలే: సోనియాకు సీమాంధ్ర మంత్రుల లేఖ

కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో ఏం చెప్పారనేది కిరణ్ కుమార్ రెడ్డి తమకు చెప్పారని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, పార్టీలో మాత్రం కొనసాగుతానని బాలరాజు చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏం చేయాలనే విషయంపై సీమాంధ్ర నేతలమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తెలంగాణపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మరో సారి తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన జరిగితే గిరిజన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన అనివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. విభజన కలిగే నష్టాలను అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు.
ఒకటి కొంటే రెండు ఫ్రీ
రాష్ట్ర విభజన విషయంలో ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నట్లుగా కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతాన్ని విభజించాలని కోరితే రెండు ప్రాంతాలను విభజిస్తారా అని ఆయన అడిగారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తెస్తున్నారని ఆయన అడిగారు.
కృష్ణా, తుంగభద్ర జలాల కోసం కర్ణాటక దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నామని, ఇప్పుడు రాయలసీమను చీలిస్తే నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలు రెండు రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications