రెండేళ్లు ప్రియుడి సహజీవనం: లేడీ టెక్కీ ఆత్మహత్య

కూతురు ప్రేమపెళ్లితో దంపతులు ఆత్మహత్య
ఇదిలావుంటే, హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన కొండపాక మండలంలోని మంగోలు గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఐదుగురు మిత్రులు కలిసి గ్రామ శివారులోకి ఓ కుంటలోకి ఈతకు వెళ్లారు. నవీన్(12) అనే విద్యార్థి నీటిలో మునిగిపోవడంతో మిగతా విద్యార్థులు భయంతో వారి నివాసాలకు చేరుకున్నారు.
విద్యార్థులు భయపడి విషయాన్ని నవీన్ తల్లిదండ్రులకు చెప్పలేదు. శనివారం రాత్రి వరకూ నవీన్ కోసం గ్రామస్తులు గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం కుంటలో మృతదేహాం తేలియాడింది. గమనించిన గ్రామస్తులు మృతదేహాన్ని చూడగా నవీన్ అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications