యుపిఎ ఇవ్వకుంటడే మేం ఇస్తాం: టీపై రాజ్‌నాథ్

యుపిఎ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించకపోతే కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేస్తామని ఆయన చెప్పారు. జులై 31వ తేదీన తెలంగాణపై చర్చించేందుకు యుపిఎ సమన్వయ కమిటీ భేటీ నిర్వహించాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌పై కిరికిరి వద్దు
రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము అంగీకరించబోంని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికార ప్రతినిధి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే సహించబోమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు తప్ప మరో దానికి అంగీకరించబోమని ఆయన అన్నారు.
తెలంగాణ సాధించే వరకు తమ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవద్దని ఆయన సీమాంధ్ర నేతలను కోరారు. తాము హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications