వచ్చే నెల 12 దాకా జగన్ రిమాండ్ పొడగింపు

కోర్టు వైయస్ జగన్‌తో పాటు ఆడిటర్ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఉన్నతాధికారి కెవి బ్రహ్మానంద రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను కూడా కోర్టు 12వ తేదీ వరకు పొడగించింది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులకు ఈ కేసు సంబంధించింది. క్విడ్ ప్రో కో రూపంలో జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో నిరుడు మే 27వ తేదీన అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గుడా జైలులో ఉంటున్నారు.
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు సోమవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వీరిద్దరిని సిబిఐ నిందితులుగా చేర్చింది.












Click it and Unblock the Notifications