టి: బిజెపి వైపు కొండా చూపు!, జగన్‌తో మైసూరా భేటీ

కొండా సురేఖ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వంటి నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెసు పార్టీ వైపు వెళ్తారని అందరూ భావించారు. అయితే బిజెపి వైపు వారు మొగ్గుచూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ, ఇతర నేతలు రెండు రోజుల్లో బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని కలువనున్నారని సమాచారం. ఆద్వానీతో భేటీ అనంతరం వారు బిజెపిలో చేరే విషయంపై స్పష్టత రానుంది. గతంలో కొండా దంపతులు అసంతృప్తితో ఉన్నప్పుడు బిజెపి నేతలు వారితో సంప్రదింపులు జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
జగన్‌తో భేటీ
ఆస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు కలిశారు.
డిగ్గీకి వివరించా: పాల్వాయి
సీమాంధ్ర నేతల అపోహలను తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు వివరించానని కాంగ్రెసు పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. డిగ్గీతో భేటీ అనంతరం పాల్వాయి మాట్లాడారు. రాయల తెలంగాణ మీడియా ప్రచారమే అన్నారు. విభజన జరిగితే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం ఉండదన్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాదులోని సీమాంధ్రులు తీర్మానం చేశారని చెప్పారు. కాగా డిగ్గీని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications