టి ఎఫెక్ట్: 15 మంది సీమాంధ్ర మంత్రుల రాజీనామా!

రాష్ట్రం విభజిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు. తమ ప్రాంత ప్రజల ఆలోచనలకు అనుకూలంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. తాము కేంద్రమంత్రి చిరంజీవి మాటను కాదనడం కాదని, అందరికీ అంతిమంగా అధిష్టానం ప్రజలే అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామా ఆమోదించాలని తమ లేఖలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చినట్లు చెప్పారు. సాయంత్రం వచ్చే ప్రకటనను బట్టి తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. రాయలసీమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే తాము రాజీనామాకు సిద్ధమని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు.
రాజీనామా దిశగా సీమాంధ్ర నేతలు
రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేసేందుకు సీమాంధ్ర నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం హైదరాబాదుకు రానున్నారు.












Click it and Unblock the Notifications