నిర్ణయం జరిగిపోయింది!: టిపై పెదవి విప్పిన సోనియా

Already decided: Sonia Gandhi on Telangana
న్యూఢిల్లీ: విభజన విషయంలో ఓ నిర్ణయం జరిగిపోయిందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులతో చెప్పారు. ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం సోనియాను కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు. ఈ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఈ దశలో వెనక్కి వెళ్లలేమని చెప్పారు. ఈ ఒక్కరోజులోనే అయిపోయిందని అనుకోవద్దని ఆమె సీమాంధ్ర నేతలతో చెప్పారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. మీ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గబోమని, విభజన అనివార్యమని సోనియా అన్నారు.

సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె మదిలో ఏముందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. నిర్ణయం జరిగిపోయిన ఈ దశలో తనను కలిసిన సీమాంధ్ర నేతలతో... నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు.

సీమాంధ్ర నేతల రాజీనామాల హెచ్చరికలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. తాము ఎప్పటి నుండో దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని, వాటి ద్వారా నిర్ణయం తీసుకున్నామని అధిష్టానం పెద్దలు తమను కలుస్తున్న నేతలకు చెబుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+