కెసిఆర్‌కు ఫస్ట్ షాక్: కాంగ్‌లోకి రాములమ్మ, అసంతృప్తే

ఆగస్టు 8వ తేదిన విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణపై ఢిల్లీ వేడెక్కిన నేపథ్యంలో విజయశాంతి కూడా గత మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిణామాలను తెలుసుకున్నారు.
ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుందని సమాచారం. ఇందుకు ఆమె ఇంటి వద్ద దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కటౌట్లు వెలువడమే నిదర్శనమంటున్నారు.
మెదక్ అసంతృప్తే కారణం
విజయశాంతి గత కొంతకాలంగా కెసిఆర్ పైన అసంతృప్తితో ఉన్నారు. 2014 ఎన్నికల్లో మళ్లీ మెదక్ పార్లమెంటు స్థానం నుండే పోటీ చేయాలని ఆమె కోరుకుంటుండగా, అధిష్టానం అందుకు సిద్ధంగా లేనట్లుగా ప్రచారం జరిగింది. మెదక్ స్థానం విషయంలో ఇరువురి మధ్య విబేధాలు వచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుండటంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications