నరేంద్రమోడీ భయంతో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తోంది: కిషన్

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం పదకొండు వందల మంది బలిదానం చేశారని, సకల జనుల సమ్మె జరిగిందని అయినా కాంగ్రెసు తెలంగాణ ఇవ్వలేదన్నారు. 2004లో తెలంగాణకు అనుకూలమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ ప్రభంజనంలో ఎంపీ సీట్లు పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు.
మోడీ ఆగస్టు 11న రాష్ట్రానికి వస్తున్నాడని తెలిసి, ఆ లోగా తెలంగాణపై ప్రకటన చేసి క్రెడిట్ కొట్టేయాలని ఆ పార్టీ చూస్తోందని అభిప్రాయపడ్డారు. అయినా తాము స్వాగతిస్తున్నామన్నారు. మోడీకి భయపడి తెలంగాణ ఇవ్వడం సంతోషమన్నారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఇప్పుడు బిజెపి ప్రభంజనం వీస్తోందన్నారు. రాయల తెలంగాణ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా: వెంకయ్య
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తన నిర్ణయం వెల్లడించాక బిజెపి స్పందిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కాంగ్రెసు తీరు ఉందన్నారు.
మొదటి నుండి అనుకూలం: రమణ్ సింగ్
బిజెపి మొదటి నుండి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు.
సోనియాతో అజాద్, అహ్మద్ భేటీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ షిండేలు భేటీ అయ్యారు. మరోవైపు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో సీమాంధ్ర నేతలు భేటీ కానున్నారు. సీమాంధ్ర నేతలు సిడబ్ల్యూసి సభ్యులు ముకుల్ వాస్నిక్, హరిప్రసాద్‌లను కలిశారు.












Click it and Unblock the Notifications