వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ప్రపంచవ్యాప్తం: 29వ రాష్ట్రమంటూ బిబిసిలో వార్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

BBC
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిల్లు పెడుతుందనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ నేపథ్యంలో గూర్ఖాల్యాండ్, విదర్భ ప్రాంతాలను కూడా విభజించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తెలంగాణపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంశం చర్చనీయాంశమైంది. బిబిసిలో తెలంగాణపై ప్రముఖంగా వార్త వచ్చింది. భారత్‌లోని తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం వెలువడవచ్చునని బిబిసి వార్తను ప్రముఖంగా ఇచ్చింది. తెలంగాణ ఇస్తే 29వ రాష్ట్రంగా ఏర్పడుతుందని పేర్కోంది. ఓయు గేటు వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఫోటోను ఉంచింది.

భారత దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెసు పార్టీ ఈ రోజు సాయంత్రం 'దక్షిణ భారత' ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని, దాదాపు నలభై మిలియన్ల ప్రజలు ఉన్న పది జిల్లాలతో పాటు హైదరాబాదుతో కూడిన తెలంగాణను కోరుకుంటుందని రాసింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు టివిలకు అతుక్కుపోయారు. రాష్ట్ర పరిణామాల పైన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న తమ బంధువుల నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
The BBC wrote that ruling Congress Party is likely to announce its support for the formation of a new state in the Telangana region of southern AP state, media reports say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X