దద్దమ్మలు: టిడిపిపై జోగి నిప్పులు, కెవిపి మంతనాలు

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగు జాతి ముక్కలవుతుంటే ఏం చేస్తోందన్నారు. పార్టీలను పక్కన పెట్టి ఉద్యమానికి సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంచాలన్నారు.
సీమాంధ్రలో నిరసనలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేటి సాయంత్రం ఓ ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాసలు ఆందోళనలు ఉధృతం చేశాయి. విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతపురం ప్రధాన ద్వారం వద్ద సిడబ్ల్యూసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేతల ఇళ్లను చుట్టుముట్టారు.
కెవిపితో మంతనాలు
విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రాంత నేతలు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు నివాసంలో భేటీ అయ్యారు.
మద్దతిస్తామా లేదా చెప్పలేం: మాగుంట
తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతిస్తామా లేదా అన్నది తాము ఇప్పుడే చెప్పలేమని ఎంపి మాగుంట శ్రీనివాసులు అన్నారు. తాము రాజీనామాలు చేస్తామని చెప్పలేదని, రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. సమైక్యవాదనను సిడబ్ల్యూసిలో వినిపిస్తానని రాష్ట్ర పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications