వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనలో టిడిపి పాత్రపై పయ్యావుల, ఆనం కంటనీరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

payyavula keshav and anam vivekanandra reddy
హైదరాబాద్/అనంతపురం: ఐదుగురు పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉన్న తమ పార్టీది తెలంగాణ విషయంలో నామమాత్రమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంగళవారం అనంతపురం జిల్లాలో అన్నారు. రాజకీయ అవసరాల కోసం విభజన డ్రామాకు కాంగ్రెసు పార్టీ తెర తీసిందన్నారు. తెలంగాణపై రోశయ్య, ప్రణబ్, శ్రీకృష్ణ కమిటీలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలేనా అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీపై నివేదికపై చర్చ జరగాలన్నారు.

విభజన జరుగుతుందనుకుంటే ఒక్క కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేసినా యూపిఏ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందన్నారు. అలాంటప్పుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారు రాజీనామా చేయవచ్చు కదా అన్నారు. లగడపాటికి రాజీనామా చేసే ధైర్యం లేదు కానీ, ఇతర నేతలకు ఉందా అన్నారు. వ్యాపారం, పదవీ వ్యామోహంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఉన్నారన్నారు.

కెసిఆర్ హుకూం

సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్ర సమితి భవనంలోనే ఉండాలని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ఎమ్మెల్యేలకు హుకూం జారీ చేశారు.

కన్నీటి పర్యంతమైన ఆనం

కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం విభజనకు అనుకూలంగా ఉంటుందని తెలియడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.

శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.

బొత్స, కిరణ్‌లతో టి నేతలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కలిశారు.

మరిన్ని డిమాండ్లు

తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. తెలంగాణ ఏర్పడితే దేశవ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటాయన్నారు. రెండో ఎస్సార్సీ వేయాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior MLA Payyavula Keshav on Tuesday said that they have only five MPs in Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X