తెలంగాణకే: రేపు ఉదయం 11.15లకు మంత్రివర్గ భేటీ

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మన్మోహన్ సింగ్ సుష్మా స్వరాజ్‌ను కోరారు. లాంఛనాలు పూర్తి చేయడమే మిగిలి ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. రేపు బుధవారం 11.15 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సిడబ్ల్యుసి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చునని, ఇది సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
1956 నుంచి తెలంగాణ డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ నిర్ణయంతో సీమాంధ్రకు ఏ విధమైన అన్యాయం జరగదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు బలగాలను పంపించలేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిపిఎం వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు పెచ్చరిల్లుతాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తమ వైఖరి మారలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications