వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంద కోట్లకు రాజ్యసభ సీటు: ఎంపి వివాదాస్పద వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Some shell out Rs.100 crore for an RS seat, Cong MP says
చండీగఢ్: మరో కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు వెళ్లడానికి కొందరు వంద కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారని రాజ్యసభ ఎంపి చౌదరి బీరేందర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"రాజ్యసభ ఎంపీ కావడానికి వంద కోట్ల బడ్జెట్ కేటాయించుకున్నట్లు ఒక ఎంపీ నాతో చెప్పాడు. ఎంపికయ్యాక అతనికైన మొత్తం ఖర్చును లెక్కించుకుంటే రూ.20 కోట్లు మిగిలాయి. అంటే రూ. 80 కోట్లు ఖర్చు చేశాడు. ఆలోచించండి! వంద కోట్లు చెల్లించి రాజ్యసభ ఎంపీ కాగలిగినే వాళ్లు... పేదల గురించి ఏం ఆలోచిస్తారు'' అని బీరేందర్ సింగ్ అన్నారు.

దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం కాంగ్రెస్‌కు అలవాటేనని, దేశంలో రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించింది.

అయితే తన వ్యాఖ్యలపై బీరేందర్ సింగ్ వివరణ ఇచ్చుకున్నారు. 'కొత్త రకం రాజకీయ వర్గం తయారైందన్నది నా మాటలకు అర్థం. ధనబలం గల వారే ఎక్కువగా లోక్‌సభ, రాజ్యసభలోకి ప్రవేశిస్తున్నారు. నేను పత్రికల్లో వచ్చిన దాన్నే ఉటంకించాను. 2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్లమెంటులో 360మంది కోటీశ్వరులు, వీరిలో కొందరు కుబేరులు ఉన్నట్లు ఓ పత్రికలో వచ్చింది' అని బీరేందర్‌సింగ్ వివరణ ఇచ్చారు.

English summary
Congress MP from Haryana, Birender Singh backtracks after claiming that those willing to shell out Rs.100 crore can become Rajya Sabha MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X