సోనియా, బాబులపై దాడి, తిరుపతి కోసం పార్టీ డిమాండ్

Dadi Veerabhadra Rao
విశాఖ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడం ద్వారా తాను భారతీయురాలిని కాదని, ఇటాలియన్‌ని అని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరూపించుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్ర రావు బుధవారం విమర్శించారు. రాష్ట్రవిభజన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. దాడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేశారు.

తెలంగాణకు అనుకూలమని ప్రకటించడం ద్వారా టిడిపి విభజనకు కారణమైందన్నారు. ఈ పరిణామం తెలుగుజాతికి తీరని అవమానమన్నారు. రాష్ట్ర విభజననను అడ్డుకోలేకపోయిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు చేతగాని వారని, కేంద్రంలో గౌరవలేనివారని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు నిధుల ప్యాకేజీ పడేస్తే పడివుంటారని సోనియా భావిస్తున్నారని, దీనిని తిప్పకొట్టాల్సిన బాద్యత సీమాంధ్రకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులపై వుందన్నారు.

రాజధాని

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేస్తే కరువు ప్రాంతం రాయలసీమ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసుకున్న తర్వాత విభజన పేరుతో దూరం చేయడం బాధాకరమన్నారు. ప్రపంచమంతా హద్దులు చెరిపేసి ఒక్కచోట ఉన్నామన్న సమయంలో విభజన చేయడం సరైంది కాదన్నారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏవో నాలుగు పార్టీలతో కలిసి మమ అనిపించి రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రాయలసీమవాసులు అన్నీ రకాలుగా నష్టపోయారన్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఏర్పాటు చేసుకున్న కర్నూలు రాజధానిని పోగొట్టుకున్నామని, బాగా అభివృద్ధి అయిన తర్వాత హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామని వాపోయారు.

నదీ జలాలు, నికరజలాలపై స్పష్టత ఇవ్వకుండానే రాష్ట్రం ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కంటే పదేళ్లు ఇరు ప్రాంతాలు అభివృద్ధి చేసిన తర్వాత విభజించి ఉంటే బాగుండేదన్నారు. 200 కి.మీ దూరంలో హద్దులు లేని ప్రాంతం నుంచి పరిపాలన ఎలా సాగిస్తారని ప్రశ్నించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సీమాంధ్ర యువతకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన జరిగితే ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండమని ప్రగల్భాలు పలికిన మంత్రులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. మరోవైపు పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేయడంపై పార్టీకి చెందిన పలువురు ఆంద్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+