పివి తనయుడు, మాజీ మంత్రి రంగారావు మృతి

గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆయన మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున రెండము సార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. బ్రహ్మచారి అయిన రంగారావుకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. రంగారావు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
రంగారావు మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications