తెలంగాణ పాపం వైయస్‌దే, కాంగ్రెస్ లెక్కేంటి: టిడిపి

ఆ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల సీమాంధ్ర కాంగ్రెసు నేతలకు చెప్పారన్నారు. విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీకి పార్లమెంటులో, అసెంబ్లీలో బలం లేదన్నారు. సిడబ్ల్యూసి ప్రకటనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముందే లీక్ చేశారన్నారు. ఆ ప్రకటన తెలియగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాల నాటకానికి తెరలేపారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు నాటకాలు ఆపాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ ప్రాంత ప్రజల హృదయాలను గాయపర్చుతున్నారని మండిపడ్డారు. ఆయన వల్లనే ఆందోళనలు చెలరేగుతున్నాయన్నారు. ఉమ్మడి రాజధాని అని ప్రకటన వచ్చాక కూడా తమకు హక్కు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ఓట్లు, సీట్లు, తెరాస విలీనం లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ విభజనకు సిద్ధపడిందని మండిపడ్డారు.
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, అలా ఉంటే నీరు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు తదితరాలపై ఉద్యమించాలన్నారు. లేదంటే రాజీనామాలకు సిద్ధం కావాలన్నారు. నాటకాలు కట్టిపెట్టాలన్నారు. విపక్షాలపై విమర్శలు చేయకుండా తమ పార్టీ తీరు ఏమిటో తెలుసుకోవాలన్నారు. మిగతా పార్టీలను విమర్శించే హక్కు వారికి లేదన్నారు.
కాంగ్రెస్ లెక్క చెప్పాలి
సీమాంధ్రలో ఏర్పాటు చేసే కొత్త రాజధానికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లెక్క సరికాదన్న ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెసు లెక్కేంటో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications