హైద్రాబాద్ కోసమే: జగన్ పార్టీ, సోనియాపై టిడిపి ఫైర్

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు.. వారి గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో బహిరంగ ప్రకటన చేయించగలరా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుచ్చయ్య చౌదరి సవాల్ చేశారు. విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు.

యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వారు కోరారు. యవత సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందన్నారు. ఉద్రేకాలకులోను కావద్దని కోరారు. హైదరాబాదు పైన సీమాంధ్రులకు హక్కు లేదన్నందుకే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. తెలుగు జాతిని చీల్చాలని విదేశీ వనిత నిర్ణయించడం బాధాకరమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పట్టాభిషేకం కోసం అడ్డంకులు తొలగించుకుంటున్నారని మండిపడ్డారు.

విగ్రహాల ధ్వంసం ఖండిస్తున్నాం: గండ్ర

జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. నీటి జలాల వంటి అంశాల పైన అనుమానాలుంటే సభలో మాట్లాడుకుందామన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులను తాము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. విభజనకు సీమాంధ్రులు సహకరించారని కోరారు. విభజనతో ఎవరికీ నష్టముండదన్నారు. విధ్వంసం తగదని సూచించారు.

సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్తల కారణంగానే రాజీనామాలు చేస్తున్నారని శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అత్యుత్త ప్యాకేజీ ఇస్తామని సోనియా చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+