కిరణ్ తెలివితేటలపై డిఎల్, స్పృహతప్పి పడిన బాబు

సమైక్యవాదం వినిపిస్తా: చింతా
రాజీనామాల వల్ల ఉపయోగం లేదని ఎంపి చింతా మోహన్ అన్నారు. సమైక్యాంధ్ర కోసం అంటూ కొందరు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం వద్ద తాను సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తానని చెప్పారు. పలువురు సమైక్యవాదులు ఆయనను అడ్డుకోవడంతో రాజీనామాపై తన నిర్ణయాన్ని సాయంత్రం చెబుతానన్నారు.
ఉద్యమంలో మండలి
సమైక్యాంద్రకు మద్దతుగా మండలి బుద్ద ప్రసాద్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం విభజనకు పూనుకుందని మండిపడ్డారు. ఇందిర బాటను వీడిన కాంగ్రెసు నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
స్పృహతప్పి పడిపోయిన సికె బాబు
సమైక్యాంధ్ర కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సికె బాబు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంతో స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications