హైదరాబాదంటే పాకిస్తానా?: షర్మిల, బాబుపై నిప్పులు
శ్రీకాకుళం: హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి ఉన్నట్లుగానే, హైదరాబాదు నగరంలో సీమాంధ్రులకు భాగముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. హైదరాబాదులో నివసించే సీమాంధ్రులు పాకిస్తాన్‌లో బతికినట్లుగా గడపాలా అని ప్రశ్నించారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభలో మాట్లాడారు.
హైదరాబాదు అందరిదని, ఇప్పుడు తాము తీసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. విశాల భారతంలో ఏ పౌరుడికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉందన్నారు. విభజన నిర్ణయం కాంగ్రెసు ఏకపక్షంగా తీసుకుందన్నారు. అది ప్రజాస్వామ్య నిర్ణయం అనిపించుకోదన్నారు. అది కోట్ల మంది ప్రజలకు విశ్వాసం కల్పించని నిర్ణయమన్నారు.

వైయస్ అన్ని ప్రాంతాల వారిని సమానంగా ప్రేమించారని, జగన్ కూడా అలాగే అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తున్నారన్నారు. పదవుల కోసం నిస్సిగ్గుగా ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని రాష్ట్ర కాంగ్రెసు నేతలు తాకట్టు పెట్టారన్నారు. అందరికీ సమ న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. సమ న్యాయం కోసం ఇంత వరకు కాంగ్రెసు, టిడిపిలకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారని ప్రశ్నించారు.
వైయస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కాకపోయి ఉండేదన్నారు. వైయస్ తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెసు పార్టీ ఆయన పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పెట్టించిందని, ఆయన కొడుకు వైయస్ జగన్‌ను జైలులో పెట్టించిందని ఆరోపించారు. టిడిపితో కుమ్మక్కై కాంగ్రెసు పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర చేస్తోందన్నారు.
వైయస్ ఏ పథకం ప్రారంభించినా కాంగ్రెసు నేతల పేర్లే పెట్టారని, అలాంటి విశ్వాసం చూపించిన వ్యక్తికి వెన్నుపోటు పొడిచిందన్నారు. తద్వారా చనిపోయిన వ్యక్తిని మరోసారి చంపవచ్చునని కాంగ్రెసు పార్టీ నిరూపించిందన్నారు. ఆయన పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. వైయస్ ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించి, తనివితీరా సేవించారన్నారు.
నాలుగేళ్లలో ఏం చేశారని కాంగ్రెసు పార్టీని ప్రశ్నిస్తే వారేం చెబుతారన్నారు. ఈ ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. తనది విజయ యాత్ర కాదని, నిరసన యాత్ర అన్నారు. ఈ రాక్షసులను ఓటుతో సంహరించిన రోజే నిజమైన పండుగ అన్నారు.
బాబుపై నిప్పులు
మోసం, వెన్నుపోటు నుండి పుట్టిన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాబుకు అధికారం ఇవ్వడమంటే నరకాసురుడికి, హిట్లర్‌కి పగ్గాలు అప్పజెప్పినట్లే అన్నారు. ఎన్టఆర్ స్థాపించిన టిడిపి నుంచి ఆయననే గెంటించిన ఘనుడు బాబు అన్నారు.
చెరువులో ఒంటి కాలి మీద జపం చేసే కొంగలా చంద్రబాబు మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చీకట్లో చిదంబరాన్ని కలిసే బాబు కాంగ్రెసు పార్టీ పైన ఈగ వాలనీయడన్నారు. సీమాంధ్రులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోడన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి బతుకుతుందో... చచ్చిపోతుందో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. హరిశ్చంద్రుడు అబద్దం చెప్పరు... చంద్రబాబు నిజం చెప్పరని ఎద్దేవా చేశారు.
ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు
వైయస్ జగన్మోహన్ రెడ్డిలాంటి ఉదయించే సూర్యూడిని ఎవరూ ఆపలేరన్నారు. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో.. ఆయన మంచివారి పక్షాన నిలబడతారన్నది అంతే నిజమన్నారు. జగన్‌ను ఎవరూ ఆపలేరన్నారు. నాలుగేళ్లుగా జరిగినా ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టారన్నారు. జైలులో ఉన్నప్పటికీ జగన్‌లో ఇసుమంత విశ్వాసం కూడా సడలలేదన్నారు. ఆయన పులి అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications