కెసిఆర్ ప్రజలను ఖతం చేస్తారు, మోసగాడు: జగ్గారెడ్డి

Jagga Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మోసగాడని, ప్రజలను ఖతం చేస్తాడని కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రజలకు మేలు జరగబోదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ మాటమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

తనకు కెసిఆర్‌తో 20 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రజలను నమ్మించడంలో కెసిఆర్‌కు ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. మాయమాటలతో యువకులను రెచ్చగొట్టి ఆశలు కల్పించి ఉద్యమం పేరుతో ప్రక్రియలో ముందుకు పోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నుంచి మెదక్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని కెసిఆర్ అనడం పచ్చి అబద్దమని ఆయన అన్నారు.

మెదక్ జిల్లాలో ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కెసిఆర్ ఏనాడూ పట్టించుకోలేదని ఆయన విమర్సించారు. ఇప్పటికీ తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రులు కక్కుర్తి పడ్డారు

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు తీరును తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు తప్పుపట్టారు. కేంద్ర మంత్రులు స్వలాభం కోసం కక్కుర్తి పడ్డారని ఆయన సోమవారం విజయవాడలో అన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు

అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. 30 లోకసభ సీట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆనయ అన్నారు. కాంగ్రెసు స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన అని ఉమ విమర్శించారు. ఆహార భద్రత బిల్లును అడ్డుకుంటే సోనియా దిగివస్తారని ఆయన అన్నారు.

అడ్డం పెట్టుకున్నాయి

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజన అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డం పెట్టుకుంటున్నాయని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి విమర్సించారు. రాజీనామాలతో పరిష్కారం లభిస్తే తాను కూడా రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన సోమవారం అనంతపురంలో ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఉద్యమం పక్కదారి పట్టకుండా, హింసకు తావు లేకుండా చూడాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+