పిక్చర్స్: తెలంగాణ కామ్, రగులుతున్న సీమాంధ్ర
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల మధ్య పరిస్థితి ఇప్పుడు తిరగబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా సీమాంధ్ర రగిలిపోతుంటే, తెలంగాణ ప్రాంతం సంబరాలకు కూడా దూరంగా ఉండి మౌనముద్రను దాల్చింది. సీమాంధ్రలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు రోజురోజుకూ ఊపందకుంటున్నాయి. దీంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో కొంత మంది రాజీనామా బాట పట్టారు.
తెలంగాణలో ఉద్యమాలు రగిలినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితే ఇప్పుడు సీమాంధ్రలో ఉంది. తెలంగాణపై గతంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటులో ఈ ప్రాంత సభ్యులు ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన భవిష్యత్తు పాత్రను పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
సీమాంధ్రలోని ప్రధాన నగరాలు కర్నూలు, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. సీమాంధ్ర నాయకులు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూనే హైదరాబాదుపై బేరసారాలకు దిగుతున్నారు. హైదరాబాదు తమ చేతి నుంచి జారిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దాంతో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదంటే దేశం రెండో రాజధానిగా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టిడిపి ఎంపీల ధర్నా
రాష్ట్ర విభజనను సమ్మతిస్తూనే సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వద్ద సోమవారం ధర్నాకు దిగారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. మంగళవారం కూడా వారు లోకసభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగారు.

ఇఫ్తార్ విందులో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్‌ను పూర్తిగా కాంగ్రెసు పార్టీ కొట్టేయడానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేస్తోంది. దీంతో కెసిఆర్ పాత్ర కాస్తా తగ్గినట్లే కనిపిస్తోంది. ఈ స్థితిలో కెసిఆర్ తన ప్రాధాన్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో కెసిఆర్ ఇలా..

హైదరాబాద్‌లో సమైక్యవాదులు
ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సిందేనని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నప్పటి నుంచి హైదరాబాద్ కాస్తా వేడెక్కింది. హైదరాబాదులోని ఆంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు యుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఝ చేశారు.

తెలంగాణ పునర్నిర్మాణంపై కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ భావిస్తున్నారు. దీంతో తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో దాని గురించి ఆదివారం విస్తృత స్థాయిలో మాట్లాడారు. జర్నలిస్టులతో కలిసి ఇలా కెమెరాలకు ఫోజులు కూడా ఇచ్చారు.

టీజీ వెంకటేష్ దీక్ష
సమైక్యవాదంతో రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ సోమవారం రిలే నిరాహారదీక్ష చేశారు. రాష్ట్ర విభజనను ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కడపలో సమైక్య సెగ
రాయలసీమలోని కడపలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లెక్కారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు.

సమైక్యవాదంతో మానవహారం
విశాఖపట్నంలోని హనుమాన్ జంక్షన్ వద్ద సమైక్యవాదులు మానవహారం నిర్మించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విశాఖపట్నంలో మొదటి నుంచి సమైక్య ఉద్యమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

తెలంగాణ మార్చ్
రాష్ట్ర విభజనకు సిడబ్ల్యుసి ప్రకటన వెలువడిన రోజు కాస్తా సంబరాలు జోరు కనిపించింది. కానీ ఆ తర్వాత సద్దుమణిగింది. ప్రక్రియ పూర్తి కోసం తెలంగాణ మౌనం వహించి ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. గతంలో తెలంగాణ మార్చ్‌లో ఇలా ఆందోళనకారులు..

నాగం నగారా..
తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరిని వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ నగారాను ఏర్పాటు చేశారు. ఆయన తెలంగాణ కోసం ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు.

సహాయ నిరాకరణ ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. సకల జనుల సమ్మెను 42 రోజుల పాటు నిర్వహించారు.

విద్యార్థి గర్జన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో సాగిన ఉద్యమంలో విద్యార్థులు పెద్ద యెత్తున పాల్గొన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు హోరెత్తాయి. పలు మార్లు ఈ విశ్వవిద్యాలయాలు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థి గర్జనలో ఇలా పోటెత్తారు.

రైల్ రోకోలు, రహదారుల దిగ్భంధం
తెలంగాణ కోసం తెలంగాణ పలు రూపాల్లో పోరాటాలు సాగాయి. రైల్ రోకో కార్యక్రమం కూడా నడిచింది. తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు ఈ సందర్భంగా అరెస్టయ్యారు. రహదారుల దిగ్బంధం కూడా జరిగింది.

పోరాట రూపాలు ఎన్నో..
తెలంగాణలో వివిధ రకాల పోరాటాలు తలెత్తాయి. విద్యార్థులు పోరాటాల్లో ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు. సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దిగ్దం చేశారు. దిష్టిబొమ్మలను చేసి శవయాత్రలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications