కాంగ్రెసు చిచ్చు పెట్టింది: ఎపి విభజనపై అరుణ్ జైట్లీ

ప్రస్తుతం ఇటు తెలంగాణాలోనూ, అటు సీమాంధ్ర ప్రాంతంలోనూ ప్రజలమధ్య వైషమ్యాలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అంతర్యుద్ధం వంటి పరిస్థితి నెలకొన్నదని ఆయన రాజ్యసభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజనపై చేసిన ప్రకటన ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం కనిపించడం లేదని ఆయన ఆక్షేపించారు.
రాజ్యసభలో మంగళవారంనాడు తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత కేంద్ర మంత్రి జెడి శీలం, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డిల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
వారి మధ్య జరిగిన వివాదం తర్వాత జైట్లీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తమ హయాంలో మూడు రాష్ట్రాలను ఎంత ప్రశాంతంగా ఏర్పాటు చేశామో గుర్తు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని, దాంతో వారు రాజ్యసభలో మాటకు మాటా పెంచుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications