తెగబడ్డ పాక్ ఆర్మీ: ఐదుగురు భారత జవాన్లు మృతి

సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించి, సార్లా పోస్టుపై మెరుపుదాడి చేసినట్లు రక్షణ వర్గాలు చెప్పాయి. ఐదుగురు భారత సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం గురించి తనకు ఈ ఉదయం చెప్పారని, ఐదుగురు సైనికులు మరణించారని చెప్పారని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
ఈ విధమైన చర్యలు పాకిస్తాన్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి గానీ మెరుగుపరచడానికి గానీ ఉపకరించవని ఆయన అన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఢిల్లీలోని సైనిక వర్గాలు చెప్పాయి.
ఈ సంఘటన ప్రభావం ఈ నెలాఖరులో తలపెట్టిన భారత, పాకిస్తాన్ దేశాల మధ్య పడవచ్చునని అంటున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications