వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిద్దరెక్కడ?, కెసిఆర్‌కు బదులుగనే షర్మిల: శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమ ఎగిసిపడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. వారిద్దరి వల్లే సీమాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు.

ఇరువురు నేతలూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా సమైక్యాంధ్ర కోసం తన వాణిని బలంగా వినిపిస్తే ఎక్కడ తన పదవి ఊడుతుందోనని ఒకరు, హైదరాబాద్‌లో తన ఆస్తులను రక్షించుకోవడానికి మరొకరు మౌనంగా ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పార్టీ నాయకురాలు షర్మిల హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పలుమార్లు సీమాంధ్ర ప్రజలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు బదులుగా షర్మిల నగరంలోని సీమాంధ్రులకు భరోసా కల్పించేందుకు మాట్లాడారన్నారు.

సోనియాకు రఘువీరా రెడ్డి లేఖ

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండని కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మంత్రి రఘువీరా రెడ్డి మంగళవారం ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన అనంతరం ఆగస్టు 3వ తేదీన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులందరూ సమావేశమైంది తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనపై చర్చించి చేసిన తీర్మానాలను సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

అభ్యంతరాలు చెప్పండి

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంెధ్ర నాయకులు ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత రాద్దాంతం చేయడం సరికాదని టి కాంగ్రెసు నేతలు కెఆర్ ఆమోస్, యాదవ రెడ్డి తదితరులు అన్నారు.

English summary
YSR Congress Party MLA Sobha Nagi Reddy alleged that CM Kiran Kumar Reddy and TDP cheif Nara Chandrababu Naidu are not reacting to Seemandhra stir though they are from the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X