జగన్‌కు ఎమ్మెల్యే కూన శ్రీశైలం గుడ్‌బై, కాంగ్రెస్ గూటికి!

Kuna Srisailam Goud
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై ఆ పార్టీ యూ టర్న్ తీసుకుందని ఆరోపిస్తూ ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు రాజీనామా చేశారు. తాజాగా కూన తన రాజీనామాతో హైదరాబాదులోని జగన్‌కు షాక్ ఇచ్చారు.

వైయస్ జగన్‌తో పాటు రంగారెడ్డి జిల్లా పార్టీ కో ఆర్డినేటర్లు కూడా రాజీనామా చేశారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట మార్చినందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కూన చెప్పారు. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ గూటికి జలగం సోదరులు?

ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు తనయులు జలగం ప్రసాద్ రావు, జలగం వెంకట్రావ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని సమాచారం. సోదరులిరువురూ ఢిల్లీలో 10వ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీతో విభేదించి, బహిష్కరణకు గురై దూరంగా ఉన్న ఇద్దరు సోదరులు కాంగ్రెస్‌లో చేరేందుకు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+