హామీ వచ్చింది: టిపై లగడపాటి, సతీష్ రెడ్డి రాజీనామా

రాష్ట్ర సమైక్యత కోసం కాంగ్రెసు ఎంపీలుగా ఏం చేయాలో అది చేస్తున్నామన్నారు. కేవలం సీమాంధ్ర కాంగ్రెసు నేతల వల్లనే ఇన్నాళ్లు రాష్ట్రం సమైక్యంగా ఉందన్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయినట్లుగా తమకు తెలుస్తోందని, దీనిని అధికారికంగా ప్రకటించాలని లగడపాటి డిమాండ్ చేశారు. ఎకె ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి తమ అభిప్రాయాలు, అనుమానాలను తెలియజేస్తామని అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చాకే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
ప్రధాని అపాయింటుమెంట్ కోరిన కర్నూలు నేతలు
విభజన ప్రక్రియ ఆపే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అపాయింటుమెంట్ దొరికితే విభజన వద్దని ఆయనను కోరనున్నారు. విభజనతో సీమ ప్రాంతానికి ఇబ్బందులని వారు చెప్పనున్నారు.
మరోవైపు సీమాంధ్ర ప్రాంతంలో ఎనిమిదో రోజు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications