జగన్ ఆదేశాలతో టిలో దిద్దుబాట, సిఎం సరదా వ్యాఖ్య

ఇందుకోసం పార్టీలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనుందని సమాచారం. కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయం జరిగిపోయిందంటున్నారు. కమిటీ విధివిధానాలు, ఎవరెవరు ఉండాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నారట. తెలంగాణలో పార్టీ మసకబారకుండా చూడాలని, ఆ ప్రాంత నేతల్లో భరోసా కల్పించాలని జగన్ చెప్పారట కూడా. ఇందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారట.
జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకే: విజయమ్మ
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెసు పార్టీ విభజన చేపట్టిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం ఆరోపించారు. ఏ పార్టీతో చర్చించకుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సీమాంధ్రలో జగన్ ప్రాబల్యం ఉంటుందని, తెలంగాణలోఅన్ని సీట్లు కాంగ్రెసుకు దక్కుతాయనే ఉద్దేశ్యంతోనే విభజనకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
నారాయణపై కిరణ్ సరదా వ్యాఖ్య
సిపిఐ నేతలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీ పార్టీ నేతలు వీర తెలంగాణవాదులని, విభజన జరిగాక నారాయణను మీతోపాటే తెలంగాణలో ఉండమనండని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుతో సరదాగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications