హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ పరిస్థితి ఏంటి? నాది వాదన కాదు: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే ఏళ్లుగా హైదరాబాదులో నివసిస్తున్న పరిస్థితి ఏమిటనే విషయమై కేంద్రం, ఆంటోనీ కమిటీ స్పష్టత ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

610 జివో ప్రకారం పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, అందులో నాలుగు వేల మందికి మినహాయింపు ఉందని, తొమ్మిది వేల మందిని పంపిస్తే మిగిలేది ఐదు వేల మందే అన్నారు. ఆ ఐదు వేల మందిలోను తెలంగాణ వాళ్లున్నారన్నారు. దశాబ్దాలుగా హైదరాబాదులో నివసిస్తున్న వారి ఆందోళన అర్థం చేసుకోవాలన్నారు.

తాను తెలంగాణకు వ్యతిరేకమో.. అనుకులమో కాదని అయితే అన్ని విషయాలలో స్పష్టత ఇచ్చాకనే ముందుకు వెళ్లాలని కోరుతున్నానన్నారు. విభజనపై ఇప్పటికి పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, ఇంకా కేంద్రం తీసుకోలేదని, ప్రభుత్వం సందేహాల్ని నివృత్తి చేయలేదన్నారు. ఉద్యోగుల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Kiran Kumar Reddy

నలభై, యాభై ఏళ్ల పాటు రాజధానిగా ఉన్న ప్రాంతంతో రాజధానికి ఇప్పటి వరకు ఎక్కడా విడిపోలేదన్నారు. మన రాజధాని అనే ఉద్దేశ్యంతోనే ఇక్కడకు అందరూ వచ్చారన్నారు. తాను కూడా ఇక్కడే చదువుకొని, పెరిగానన్నారు. కోరికలు, ఉద్యమాల వల్ల రాష్ట్ర ఏర్పాటు జరగదన్నారు.

ప్రజలందరి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రానికి చెందిన అంశం కచ్చితచంగా చర్చకు రావాల్సిందే అన్నారు. రోశయ్య కమిటీలో పలు అంశాలు పొందుపర్చామని, వాటికి సమాధానం చెప్పవల్సి ఉందన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సమతూకం, సమన్యాయం చేయాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణపై రెండో ఎస్సార్సీ అనేది కాంగ్రెసు పార్టీ హామీ అని కిరణ్ చెప్పారు. తాము 2004లో ఈ హామీ ఇచ్చామన్నారు. ఆంటోనీ కమిటీలో ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారన్నారు. ఆందోళనకారులు ఆవేశపడవద్దని, ఆందోళనపడవద్దన్నారు. తాము అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకం కాదని, వారికి చెప్పేందుకే ఇదంతా అన్నారు. విభజించే ముందు చాలా పనులు చేయాల్సి ఉంటుందన్నారు.

తాను ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం తనకు అలవాటు అన్నారు. తనది వాదన కాదని, వాస్తవ పరిస్థితి అన్నారు. తాను చెప్పే అంశాలు ప్రజల ముందుకు కచ్చితంగా వస్తాయని, తాను చెప్పేది సమంజసమో కాదో మీరే చెప్పాలని విలేకరులను ప్రశ్నించారు. ఏ ఉద్యమ ప్రభావం అయినా ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy's press meet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X