వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ మీడియా సమావేశం, ఉద్యోగుల్ని కల్పిన బోనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: విభజనపై కాంగ్రెసు పార్టీ ప్రకటన వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి గురువారం సాయంత్రం ఏడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. కిరణ్ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం ఏడు గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. విభజనపై పది రోజుల క్రితం ప్రకటన వచ్చినప్పటి నుండి ఆయన దాదాపు క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు.

సచివాలయంలో సహపంక్తి భోజనం

కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాక సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారు ఐదు రోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రాష్ట్రాన్ని విభజించవద్దని విధులను కూడా బహిష్కరించారు. కొన్ని సందర్భాలలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీ నినాదాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

కానీ, ఈ రోజు సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు కలిసిపోయారు! సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సచివాలయంలోని అమ్మవారి తెలంగాణ ఉద్యోగులు బోనాల పండుగ చేసుకున్నారు.

దీంతో సీమాంధ్ర ఉద్యోగులు రోజులా కాకుండా మౌన ప్రదర్శన చేశారు. బోనాల పండుగ జాతర ఉన్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తాము మౌన ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఇరు ప్రాంత ఉద్యోగులు సహపంక్తి భోజనం చేశారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy will talk to media on Thursday evening 7'O clock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X