వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్ నడిపి బాబుపై మండిపడ్డ రోజా, పవర్‌లెస్: మైసూరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja and Mysoora Reddy
చిత్తూరు/హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో గురువారం పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా ద్విచక్ర వాహనాన్ని నడిపి హల్ చల్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సందర్భంగా ఆమె వెహికిల్‌ను నడిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటే చంద్రబాబు మాత్రం తెలుగు జాతి మనది రెండుగ చీలిన జాతి మనది అంటున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

పవర్‌లెస్ కమిటీ: మైసూరా

కాంగ్రెసు పార్టీ అధిష్టానం నియమించిన హైలెవల్ కమిటీ.. పవర్‌లెస్ కమిటీ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి గురువారం ఎద్దేవా చేశారు. ఎకె ఆంటోని కమిటీ నియామకం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో చీలిక తెచ్చి, రాజకీయ లబ్ధి పొందేందుకే ఎకె ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. విభజనకు హైదరాబాద్, జలవనరుల పంపిణీయే అసలు సమస్య అన్నారు.

కాంగ్రెసు విభజన విషయాన్ని సొంతింటి వ్యవహారంల భావించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రజల కోసం ఆలోచించకపోవడం సరికాదన్నారు. ఎంపీల నిరసన ఓ రాజకీయ డ్రామా అన్నారు. చిత్తశుద్ధి ఉంటే వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణపై వైఖరి మార్చుకోనని చెబుతుంటే ఆ పార్టీ ఎంపీలు సభలో ఆందోళన చేయడం ఏమిటన్నారు. ఆందోళనలో పాల్గొంటే కేసులు పెడతామని డిజిపి హెచ్చరిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వాటిని ఎత్తివేస్తామన్నారు. విభజనపై బాబు వ్యాఖ్యలు దురదృష్టకరమని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అన్నారు.

English summary
YSR Congress Party leader Roja lashed out at Telugudesam Party chief Nara Chandrababu Naidu for his stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X