నిరసనలో కొడుకుతో కలిసి గల్లా, చిరు ఫ్యాన్స్ హెచ్చరిక

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలిసి ఉంటే కలదు సుఖమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రశాంతంగా ఉద్యమిద్దామని వారు పిలుపునిచ్చారు. అందరం కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. రేపటి నుండి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు.
చిరు ఫ్యాన్స్ హెచ్చరిక
సమైక్యాంధ్ర కోసం విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాస రావు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. చిరంజీవి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. చిరు సమైక్యవాది అని, ఆయన పైన ఎవరైనా అభ్యంతర వ్యాఖ్యలు చేసినా, కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకున్నా ఊరుకునేది లేదని అభిమానులు హెచ్చరించారు.
మంత్రి తోట సతీమణి దీక్ష
సమైక్యాంధ్ర కోసం మంత్రి తోట నర్సింహం సతీమణి రేపటి నుండి కాకినాడలో దీక్ష చేపట్టనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జిల్లాలో పదో రోజు బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా జిల్లాలోని పలు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.
విభజనకు నిరసనగా రహదారిపై స్నానాలు
రాష్ట్ర విభజనకు నిరసనగా ఆర్టీసి ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నేటితో ఐదో రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం వారు మద్దెలపాలెం వద్ద జాతీయ రహదారి పైన స్నానాలు చేసి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications