పదవిలో ఉండి కిరణే సమస్య చెప్తే ఎలా?: సోమిరెడ్డి

విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే తప్ప ప్రభుత్వానిది కాదన్న ముఖ్యమంత్రి వాదన అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ కమిటీలో యూపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం వంటివారు ఉన్నారని, దేశాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీనా... వేరే పార్టీనా? చెప్పాలన్నారు.
గత పదిహేను రోజులుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము మాట్లాడుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని, వాటిపై స్పష్టత కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నామని, అవి తేలిన తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నది తమ డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో మరో భాగమే ఆంటోనీ కమిటీ అని తెదేపా సీమాంధ్ర నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. సొంత రాష్ట్రాల ప్రయోజనాల కోసం చిదంబరం, వీరప్ప మొయిలీ తెలుగు జాతిని ముక్కలు చేశారు. వారినే మళ్లీ ఆంటోనీ కమిటీలో సభ్యులుగా వేశారు. దీనిని బట్టే ఈ కమిటీ నిజ స్వరూపం తెలుస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications