హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగులో నరేంద్ర మోడీ స్పీచ్(MODYfy పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నవ భారత యువ భేరీ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ''సోదరులారా.. సోదరీమణులారా.. నమస్కారం. భారత దేశ ప్రగతికి తెలుగు వారి కృషి ప్రశంస నీయం. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని మనస్పర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి మీరందరూ త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నాని. గుజరాత్‌తో తెలుగు వారి సంబంధాలు చాలా ప్రాచీనమైనవి. కాబట్టి గుజరాత్‌లో చాలా తెలుగు మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదుకు స్వాతంత్రం వచ్చింది. అదే రోజు నా పుట్టిన రోజు కావడం విశేష''మని మోడీ అన్నారు.

యువకులు ఐదు రూపాయలు ఇచ్చి ఈ సభకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఓ స్వతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని ఒప్పించి సభకు వచ్చాడన్నారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు వారించిన ఆయన తనను ఆశీర్వదించేందుకు వచ్చారన్నారు. గత పదిహేను రోజులుగా జరుగుతున్న సంఘటనలో దేశంలో చర్చనీయాంశమవుతున్నాయన్నారు.

ఐదుగురు జవాన్లను పాకిస్తాన్ సైన్యం హతమార్చడం దేశంలో అభద్రతా భావాన్ని పెంచిందన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎక్కడుందని దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. జమ్ము కాశ్మీర్‌లో మత ఘర్షణలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ పైన నమ్మకం కోల్పోయిన దేశ ప్రజలు ఆ పార్టీ నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు.

దేశంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, సరిహద్దురేఖల వెంబటి భద్రతా లోపం ఆందోళనకరమన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి చొరబాటులను కేంద్రం అడ్డుకోలేకపోయిందని మండిపడ్డారు. చైనా సరిహద్దుల నుండి భారత్ సైనాన్ని వెనక్కి రప్పించడం శోచనీయమన్నారు. కేంద్రం అనాలోచిత విధానాలతో సామాన్యుడికి భద్రత లేకుండా పోయిందన్నారు. చైనా నగరాలు బాగున్నాయని, అక్కడే నివసించాలని విదేశాంగ మంత్రి కోరుకోవడం సిగ్గుచేటు అన్నారు.

అభివాదం

అభివాదం

అభివాదం

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ, ఇతర నేతలు సభలో అభివాదం చేస్తున్న దృశ్యం

సభకు వచ్చిన మోడీ

సభకు వచ్చిన మోడీ

నవ భారత యువ భేరీ సభకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ, చిత్రంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్ర సేనా రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు...

 'మోడి'ఫై

'మోడి'ఫై

ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు భారీగా యువత, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సభలో ఓ అభిమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చిత్రంతో హల్ చల్ చేశారు.

సన్మానం

సన్మానం

నవ భారత యువ భేరీ సభకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి 2014 ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీకి హైదరాబాద్ నగర శాఖ సన్మానం చేసింది. ఆయనకు ఓ జ్ఞాపికను అందజేసింది.

భారీగా ప్రజలు

భారీగా ప్రజలు

రాష్ట్ర బిజెపి శాఖ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు భారీగా యువత, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. బిజెపి జెండాలతో హాజరైన దృశ్యం

మహిళలు, నారీమణులు

మహిళలు, నారీమణులు

రాష్ట్ర బిజెపి శాఖ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు భారీగా యువత, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. మహిళలు, యువతులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

యువత హల్ చల్

యువత హల్ చల్

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభకు భారీగా హాజరైన యువకులు. ఈ సభ రాష్ట్ర బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైంది.

పాకిస్తాన్ పెట్రేగిపోతున్నా కేంద్రం నిశ్సబ్దంగా ఉందని, కేరళలో మన మత్స్యకారులపై విదేశీయులు కాల్పులు జరిపినా వారికి బెయిల్ ఇప్పించిందని విమర్శించారు. కేంద్రానికి ఏ అంశం పైనా నిశ్చితాభిప్రాయం లేదన్నారు. దేశ భవిష్యత్తును మార్చే శక్తి యువతలో ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారన్నారు. యూపిఏ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ పాలసీ విభజించి పాలించడమన్నారు.

కాంగ్రెస్ పార్టీ అవినీతి అన్ని రంగాలలో వ్యాపించిందన్నారు. కాంగ్రెసు సుదీర్ఘ పాలనలో ప్రజలకు తినేందుకు తిండి, నివసించేందుకు ఇళ్లు లేవన్నారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో అందరికి ఇళ్లు, తిండి దొరికేదన్నారు.

మోడీ క్షమాపణలు

సభకు హాజరుకావాలని వచ్చి స్టేడియంలో చోటులేక బయట ఉండిపోయిన వారికి మోడీ క్షమాపణలు చెప్పారు. ఈ స్టేడియం కన్నా తన హృదయం విశాలమైనదని, అందులో అందరికీ చోటుంటుందన్నారు. మరోసారి తాను తప్పకుండా హైదరాబాదుకు వస్తానని, ఇప్పుడు కలవలేకపోయిన వారందరినీ తాను కలుస్తానని చెప్పారు. కాగా మోడీ సభ కోసం రూ.5 రుసుము పెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా వచ్చిన రూ.10 లక్షలను బిజెపి మోడీకి ఉత్తరాఖండ్ బాధితుల కోసం అందజేసింది.

English summary
Narendra Modi speech in Nava Bharatha Yuva Bheri
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X