కెజి బేసిన్ వాటా అడగట్లేదు: రాపోలు, కాంగ్‌పై డి రాజా

పెద్ద మనుషుల ఒప్పందాన్ని సీమాంధ్ర నేతలు ఎప్పుడు గౌరవించలేదని, స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ముల్కీ ఉద్యమం వచ్చిందని అన్నారు. యూపిఏ, సిడబ్ల్యూసి తీర్మానాల ఆధారంగానే విభజన జరుగుతుందని చెప్పారు. నదీ జలాల్లో తమకు అన్యాయం జరిగిందన్నారు.
సీమాంధ్రలో ఎన్నో వనరులు ఉన్నాయని, ఇరు ప్రాంతాలు విడిపోయి అభివృద్ధి చెందవచ్చునన్నారు. తమ నాయకురాలు విభజనకు బాట వేశారని, అందరూ ఆమె బాటలో నడవాల్సిందే అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కోసమే నిర్మిస్తే, సీమాంధ్రుల ప్రయోజనాల కోసం దానిని నీటి పారుదల ప్రాజెక్టుగా మార్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కాంగ్రెసు పార్టీదే పూర్తి బాధ్యత అని సిపిఐ నేత డి.రాజా న్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా సిపిఐ నాడు ఉద్యమాలు నిర్మించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిందన్నారు. తమ పార్టీ నేత రావి నారాయణ రెడ్డి హైదరాబాదు నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి లోకసభకు వచ్చారన్నారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మండళ్లు వేసినా అవి సఫలం కాలేదన్నారు. అనేక పరిణామాల తర్వాత విభజన అనివార్యమైందన్నారు. విభజన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ చేదు అనుభవాలని డి.రాజా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications